- Advertisement -
హైదరాబాద్: బనకచర్ల జలవివాదం పరిష్కరించాలని ప్రయత్నిస్తే రెండు రాష్ట్రాలు తప్పుబడుతున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. జలవివాదాన్ని కమిటీ పరిష్కరిస్తుందని అన్నారు. జనగామ జిల్లాలో ఎపి, తెలంగాణ జలవివాదంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి విషయంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడతాం అని తెలియజేశారు. తెలంగాణ వాదాన్ని బిఆర్ఎస్ మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) చేస్తున్నట్టు అనుమానం ఉందని, ఏ ఒక్క స్కామ్ లోనూ మాజీ సిఎం కెసిఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. రెండు పార్టీల నేతలు తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
- Advertisement -