Monday, August 18, 2025

వరంగల్ వివాదాలపై సీనియర్లతో కమిటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్ర తినిధి: వరంగల్ వివాదాల పరిష్కారానికి సీనియర్ కాంగ్రెస్ నేతలతో కమిటీ నియమించాల్సిందిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేసింది. పిసి సి క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపి డాక్ట ర్ మల్లు రవి అధ్యక్షతన ఆదివారం కమిటీ సమావేశం జరిగింది. సమావేశానంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ వ రంగల్ జిల్లాలో నెలకొన్న పంచాయితీ ప రిష్కారానికి సీనియర్ నాయకులతో కమిటీని నియమించాల్సిందిగా పిసిసి అధ్యక్షునికి సిఫార్సు చేస్తూ లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఈ మేరకు తాను లేఖ రాశానని ఆయన తెలిపారు. గజ్వేల్ డిసిసి నర్సారెడ్డి దాడి ఘటన తమ దృష్టికి వచ్చిందని, ఘటనపై పూర్తి వివరాలు సేకరించామని ఆయన చెప్పారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జి. వివేక్ సమక్షంలో ఈ ఘటన జరిగిందని, దీంతో మంత్రి వివేక్ నుంచి కూడా సమాచారం సేకరించామని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచూ చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలపై పరిశీలన చేయాల్సిందిగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణా కమిటీకి సూచన చేశారని ఆయన తెలిపారు. దీంతో తాము వివరాలు సేకరిస్తున్నామన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ?, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందన్న సమాచారాన్నీ సేకరిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయపై తాము వచ్చే మంగళవారం మరోసారి సమావేశం కానున్నామని ఆయన చెప్పారు. తాను మంటలు ఆర్పేవాన్నే తప్ప మంటలు పెట్టే వ్యక్తిని కాదని మల్లు రవి అన్నారు. రాజగోపాల్ రెడ్డి కంటిలో నలుసు చందంలా మారారని పిసిసి నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించకపోతే భవిష్యత్తులో ఇంకా ఎవరైనా ఇలాగే మాట్లాడుతారన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News