Thursday, May 8, 2025

పవన్‌కళ్యాణ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌పై పోలీసు స్టేషన్‌లో కొందరు ముస్లిం యువకులు ఫిర్యాదు చేశారు. ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మున్సిపల్ ఛైర్మన్ ఖాజా ఆధ్వర్యంలో ఎస్‌ఐ కాశీనాథ్‌కు వారు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వాళ్లు అన్నారు.

100 శాతం ముస్లింలు ఉగ్రవాదులే అని అనడం తప్పు అని.. ఉగ్రవాదానికి ఇస్లాంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇస్లాం శాంతి, ప్రేమకు సంబంధించన మతం అని అన్నారు. ముస్లింల గుర్తింపు అయిన టోపీలు, గడ్డాలు, కుర్తాలు, స్కార్ప్‌లను పవన్‌ కల్యాణ్‌ ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. పవన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News