- Advertisement -
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఇది పూర్తి స్థాయి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. మొత్తం కాస్ట్ అండ్ క్రూ ఇప్పటికే ఖరారు కావడంతో, టీం ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై అంతటా రెక్కీ చేస్తున్నారు. మొదటి షూటింగ్ షెడ్యూల్ కోసం సరైన లొకేషన్ల కోసం వెతుకుతున్నారు. జూన్ చివరి వారంలో షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.
- Advertisement -