Saturday, September 13, 2025

యుపిఎస్‌సి తరహాలో పరీక్షలు నిర్వహించండి: రాంచందర్ రావు

- Advertisement -
- Advertisement -

యుపిఎస్‌సి తరహాలో రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టిజిపిఎస్‌సి) కూడా జాబ్ క్యాలెండర్ రూపొందించి ప్రతి ఏడాది పరీక్షలు నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్షకు దిగక ముందే నోటిఫికేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. గ్రూపు 1, గ్రూపు 2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వేలాది మంది నిరుద్యోగులు హైదరాబాద్, అశోక్ నగర్ లైబ్రరీ వద్ద,

అఫ్జల్‌గంజ్ లైబ్రరీ వద్ద ఇంకా వివిధ ఇనిస్టిట్యూట్స్ వద్ద రాత్రింభవళ్ళు చదువుతూ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నదని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం, 70 వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ మాటలు చెప్పడమే తప్ప నియామకాలకు సంబంధించి లెక్కలు చూపించడం లేదని ఆయన విమర్శించారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి ఆ ప్రకారం నియామకాలు చేపట్టాలని రాంచందర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బిఆర్‌ఎస్ స్పెషల్ ఫోకస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News