- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపిలు చేస్తున్న రాజకీయాల్లోనే నాణ్యత లేదని, నాణ్యత లేనిది కాళేశ్వరం, మేడిగడ్డలో కాదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) విమర్శించారు. అశాస్ర్తీయ నివేదికలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. ఎన్డిఎస్ఎ నివేదికను ఎన్డీఎ నివేదిక అనడంలో తప్పులేదని చెప్పారు. శాస్త్రీయ వివరాలు లేకుండానే కాంగ్రెస్, బిజెపి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుందని, కాళేశ్వరం తెలంగాణకు జీవధార, మాజీ సిఎం కెసిఆర్ ఒక దార్శనికుడని కెటిఆర్ పేర్కొన్నారు.
- Advertisement -