హైదరాబాద్: పాలమూరు బిడ్డల చెమటతోనే ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. పాలమూరు అంటే తనకు ఎంతో గౌరవం అని అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలబెడతానని చెప్పారు. ఈ సందర్భంగా పాలమూరులో సిఎం మాట్లాడుతూ..గిరిజనల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ది అని చెప్పారు. అచ్చం పేటలో ప్రతిరైతుకు సోలార్ విద్యుత్ అందించి తీరుతామని తెలియజేశారు. సోలార్ విద్యుత్ అందించడమే కాదు.. ఆదాయం వచ్చేలా చేస్తామని రుణమాఫీ చేశామని తెలియజేశారు.
వడ్లకు బోనస్ ఇస్తున్నామని, వరి వేసుకుంటే ఉరేనన్న దొర మాత్రం వరి వేసి అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. రైతుల కోసం ఇప్పటి వరకు రూ. 60 వేల కోట్లు ఖర్చు చేశామని, 50 లక్షల పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. మహిళలే ఆర్టిసి బస్సులు అద్దెకు తప్పుకునేలా చేశామని, మహిళా సంఘాలను పెట్రోలు బంకులకు యజమానులను చేశామని పేర్కొన్నారు. .2029 లోపు కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.