మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అనుసరించనున్న వ్యూహంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్‌పెరుమాళ్ ప్రజాభవన్‌లో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిలతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముందుకెళ్లే వ్యూంపై మంత్రులకు ఏఐసిసి కార్యదర్శి దిశనిర్దేశం చేశారు. ఉప ఎన్నికను గెలిచేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి : మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రజాభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు దిశానిర్దేశనం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన రేషన్ కార్డులు, సన్నబియ్య, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ప్రతి ఇంటికి ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి బూత్‌కు ఒకరు ఇంచార్జ్‌గా ఉండి పారిశుధ్య,తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఎక్కడా ఉండకుండా చూడాలని తెలిపారు. బూత్‌ల వారీగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెండింగ్‌లో ఉన్న ఇతర పథకాలను పూర్తి చేయాలన్నారు