Monday, August 25, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ నజర్

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 30న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ చోర్…గద్దీచోడ్ పేరిట బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, పలువురు కార్పోరేషన్ల చైర్మన్లు కలియతిరుగుతున్నారు. మరోవైపు ఓట్ చోర్ .. గద్దీ చోడ్ పేరిట ప్రస్తుతం ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోనూ ఓట్ చోర్..గద్దీ చోడ్ పేరిట ఈ నెల 30న బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సభకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించాలని వారు నిర్ణయించారు. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. జూబ్లీహిల్స్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉన్నది. బిఆర్‌ఎస్ కూడా తమ సీటును ఎట్టిపరిస్థితుల్లో కాపాడుకోవాలని యత్నిస్తున్నది. మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇరు పార్టీల మధ్య బిజెపి ఈ సీటుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. త్రిముఖ పోటీ ఏర్పడుతుందేమోనన్న భావనతో కాంగ్రెస్ తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఓట్ల చోరీ పేరిట బహిరంగ సభకు సిద్ధమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News