Friday, July 25, 2025

భారతీయుల భవిష్యత్‌కు తెలంగాణ భరోసా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ విజయాన్ని కేవలం అంకెలతో మాత్రమే కాకుండా ఆ త్మగౌరవానికి, పట్టుదలకు ప్రతిరూపంగా చూడాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారా వు వ్యాఖ్యానించారు. కోట్లాది మంది భారతీయులకు భవిష్యత్తుపై భరోసాను కల్పించిన విజయగాథ తెలంగాణ అని పేర్కొన్నారు. లండన్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో కెటిఆర్ ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ప్రపంచలోనే అతిపెద్ద 5 టెక్ దిగ్గజ కంపెనీల ఆఫీసులు తెలంగాణలోనే ఉన్నాయని అన్నారు. బటర్ ఫ్లై ఎఫెక్ట్ లాగానే కెసిఆర్ ఎఫెక్ట్ గురించి కూడా చె ప్పుకోవాలని చెప్పారు. 70 వేల రైతుల ఖాతాల్లో సుమారు 75 వేల కోట్ల రూపాయలను జమచేసిన ఏకైక నాయకుడు స్వతంత్య్ర భారతచరిత్రలో కెసిఆర్ ఒక్కడే అని వ్యాఖ్యానించారు. అంతేకాదు కో టి ఇండ్లకు శుద్దిచేసిన తాగునీటిని అందించిన ఏకై క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ఒక్కటే అని పేర్కొన్నారు. ప్రజల
జీవితాలను మార్చాలన్న సంకల్పం ఉన్న నాయకుడు పదవిలో ఉంటే ఏం జరుగుతుందో అనడానికి తెలంగాణ సాధించిన విజయాలే సాక్ష్యం అని తెలిపారు. ఈ ప్రపంచానికి ఇండియానే భవిష్యత్తు అని, తెలంగాణ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని అన్నారు.

తెలంగాణ శిథిలాల నుంచి గెలుపు సౌధాలను నిర్మించింది
దశాబ్దాల పోరాటం తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడిందని కెటిఆర్ తెలిపారు. స్వతంత్ర భారతంలో అద్భుతమైన ఆర్థిక పురోగతి, ప్రగతిని చూపించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. అహింసాయుతంగా జరిగిన ఒక మహా అద్భుత పోరాటం తెలంగాణ ఉద్యమం అని, తెలంగాణ విజయాన్ని కేవలం అంకెలతో మాత్రమే చెప్పుకుంటే సరిపోదని చెప్పారు. ఆత్మగౌరవం, పట్టుదలకు ప్రతిరూపంగా చెప్పుకోవడంతో పాటు లక్షలాది మంది భారతీయులకు భవిష్యత్తుపై భరోసాను ఇచ్చిన విజయగాథలాగా తెలంగాణను చూడాలన్నారు. సబ్బండ వర్ణాల భాగస్వామ్యంతో సాధించిన సమ్మిళిత వృద్ధిలాగా తెలంగాణ విజయాన్ని చెప్పుకోవచ్చని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉంది అని, 2015 నుంచి 2019 మధ్య కాలంలో కేవలం నాలుగు సంవత్సరాల స్వల్ప కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని వెల్లడించారు. అమెరికా అవతల హైదరాబాద్‌లోనే అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ ఉందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ హైదరాబాద్‌లోనే ఉందని వివరించారు.

ప్రపంచంలోని మూడో వంతు వ్యాక్సిన్ ఉత్పత్తి తెలంగాణలో జరుగుతుందని, ప్రపంచంలోనే ఐదు అతిపెద్ద టెక్ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లోనే తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయని చెప్పారు. ఐటీ రంగ ఉద్యోగ కల్పనల్లో వరుసగా రెండు సంవత్సరాల పాటు బెంగళూర్‌ని హైదరాబాద్ దాటిందని అన్నారు. కొత్త రాష్ట్రంగా శిథిలాల నుంచి గెలుపు సౌధాలను తెలంగాణ నిర్మించిందని వ్యాఖ్యానించారు. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో తాము తెలంగాణ రాష్ట్రంగా నూతన ప్రయాణాన్ని మొదలుపెట్టామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే అనుమతుల కోసం ఎన్ని రోజులు పడుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉండేదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 15 రోజుల్లో అనుమతులు వచ్చేలా చేశామని గుర్తు చేశారు. ఒకవేళ 15 రోజుల్లో లోపు అనుమతులు రాకపోతే ఆ పరిశ్రమను ప్రారంభించుకునే అవకాశం కల్పించామన్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అవకాశం లేదని, వ్యక్తుల కంటే విధానాలకే తాము ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.

తెలంగాణ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది
భారతదేశంలోని 65 శాతం ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారని, అందుకే తాము వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయని కెటిఆర్ పేర్కొన్నారు. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా దాదాపు 75వేల కోట్ల రూపాయలను జమచేసిన రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదని చెప్పారు. తాము తీసుకొచ్చిన ఈ పథకం అద్భుత ఫలితాలను ఇచ్చిందని, అందుకే 2014లో ధాన్యం ఉత్పత్తిలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ పంజాబ్, హర్యానా దాటి 2022 నాటికి నంబర్ వన్‌కు చేరిందని అన్నారు. 80 మీటర్ల సముద్ర మట్టం నుంచి 618 మీటర్లకు నీటిని తీసుకెళ్లే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని

కెసిఆర్ ప్రారంభించారని, ఇన్ లాండ్ ఫిషరీస్‌లో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పారు. పారిశ్రామిక అవసరాల కోసం తగినంత నీటిని అందుబాటులో ఉంచిన రాష్ట్రం తెలంగాణ అని, కెసిఆర్ హయాంలో ఫ్లోరోసిస్ పూర్తిగా నిర్మూలించబడిందని తెలిపారు. హైదరాబాదు లాంటి నగరానికి నీటి సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారాన్ని కెసిఆర్ చూపించారని అన్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థకు ప్రతినిధిగా మీ భాగస్వామ్యం కోసం వచ్చాను. మనం కలిసి అద్భుతాలు చేయవచ్చు అంటూ ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. ఈ ప్రపంచానికి ఇండియానే భవిష్యత్తు అని, తెలంగాణ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News