Thursday, May 8, 2025

ఆపరేషన్‌ సిందూర్‌.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భేటీ

- Advertisement -
- Advertisement -

ఆపరేషన్ సిందూర్ ను చేపట్టిన భారత ఆర్మీని చూసి గర్విస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్థావరాలపై భారత బలగాల దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌, సచిన్‌ పైలట్‌ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్శంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఉగ్ర స్థావరాలపై ఉక్కుపాదం మోపిన భారత సాయుధ దళాలను చూసి గర్విస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఇక, ఆపరేషన్ సిందూర్ పై ఖర్గే మాట్లాడుతూ.. దేశ రక్షణ విషయంలో సైనికులు తీసుకొనే ప్రతి నిర్ణయానికీ కాంగ్రెస్‌ మద్దతు ఉంటుందని తెలిపారు.దేశ రక్షణ కోసం మనమంతా ఐక్యంగా ఉండాలని ఖర్గే అన్నారు.

కాగా,  భారత సాయుధ దళాలు.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన స్థావరంతోపాటు మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా వంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్ తో విరుచుకుపడ్డాయి. భారత సైనికుల దాడుల్లో భారీగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News