హైదరాబద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి పార్టీ అధినేత కెసిఆర్.. ఆయన కుమార్తె కవితను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. ఈ విషయంపై తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) స్పందించారు. బిఆర్ఎస్‌కు పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమని ఆయన అన్నారు. కెసిఆర్‌కు కుమార్తె, కుమారుడు ముఖ్యం కాదని.. పార్టీనే ముఖ్యమని ఆయన తెలిపారు.
‘‘దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలోనూ జరిగాయి. ప్రతి కుటుంబంలో గొడవలు సహజం. కెసిఆర్‌కు తెలంగాణ ప్రజలే ముఖ్యం. తన కుమార్తె, కుమారుడి కోసం ఆయన పార్టీని నాశనం చేసుకోలేరు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో సిబిఐ మాత్రమే కాదు.. ఎవరు ఏమీ చేయలేరు. సిబిఐ పేరుతో కెసిఆర్‌ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం కరెక్ట్ కాదు. ఆయనలాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ నాయకుడిగా ఉండటం మనందరి అదృష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తోంది’’ అని మల్లారెడ్డి (Mallareddy) అన్నారు.
Also Read : నవంబర్‌లో స్థానిక సమరం?