- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్బినగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిందన్నారు. మంత్రి పదవి కాదు మునుగోడు ప్రజలు ముఖ్యమని ఇక్కడి నుంచే పోటీ చేశానని వివరణ ఇచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2018 ఎన్నికల్లో అందరూ ఓడిపోతే తాను గెలిచాననని కోమటిరెడ్డి గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనని ఓడించింది బిఆర్ఎస్ కాదు అని కమ్యూనిస్టులేనని మండిపడ్డారు. బిఆర్ఎస్ కు కమ్యూనిస్టులు మద్దతు తెలపడం వల్లే తాను ఓడిపోయానని రాజగోపాల్ స్పష్టం చేశారు.
- Advertisement -