Tuesday, September 9, 2025

గోదావరి జలాలతో తుంగతుర్తి నియోజక వర్గం సస్యశ్యామలం: ఎమ్మేల్యే మందుల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ /అర్వపల్లి: తుంగతుర్తి నియోజక వర్గంలో గోదావరి జలాలతో లక్ష ఎకరాల వరకు పంటలు పండించుకోవచ్చని తుంగతుర్తి ఎమ్మేల్యే మందుల సామేల్ అన్నారు. సోమవారం జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో బయ్యన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి తుంగతుర్తి నియోజక వర్గానికి ఐదువందల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం గోదావరి జలాలకు పూలాభిషేకం నిర్వహించి మాట్లాడారు. గోదావరి జలాల ద్వారా సూర్యాపేట జిల్లాకు రెండులక్షల పద్నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తుంగతుర్తి నియోజక వర్గంలో లక్ష ఎకరాల వరకు రైతులు పంటలు పండించుకోవచ్చని వారన్నారు. నియోజకవర్గంలోకి అరవైతొమ్మిది, డెబ్బై, సెవెంటీవన్ డిబిఎం ద్వారా ఆయా మండలాలకి తిర్మలగిరి, తుంగతుర్తి, నాగారం, అర్వపల్లి, నూతనకల్, మద్దిరాల మండలాల్లో సాగునీరు అందుతుందని దాని ద్వారా చెరువులు కుంటలు నింపుకుని రబీ సీజన్‌లో పంటలు పండించుకోవచ్చని వారన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో నియోజక వర్గానికి సాగు నీరు అందిస్తు రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని వారన్నారు. నియోజక వర్గ అభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నారని అనేక సంక్షేమ పథకాలతో పాటు పలు అభివృధ్ది కార్యక్రమాలు చేపట్టారని రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేసి స్తానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని వారన్నారు.ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు ఈఈ సత్యనారాయణ, డిఈ సునీత, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్, మండల అధ్యక్షులు మోరపాక సత్యం, లింగయ్య తోపాటు జిల్లా నాయకులు జనార్థన్, గుడిపెల్లి మధూకర్ రెడ్డి, మాజీ జెడ్‌పిటిసి కొరపిడత అవిలయ్య, నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News