Tuesday, May 20, 2025

బిజెపి అంటే.. బూతు జనతా పార్టీ: అద్దంకి ఫైర్

- Advertisement -
- Advertisement -

బిజెపి పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. బిజెపి అంటే. భారతీయ జనతా పార్టీ కాదని.. అది బూతు జనతా పార్టీ అని మండిపడ్డారు. బిజెపి సోషల్ మీడియా వాళ్లకు సిగ్గు, లజ్జ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీ భవన్ లో అద్దంకి మీడియాతో మాట్లాడుతూ.. “బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నల్లికుట్లోడి లాగ కనిపిస్తాడు.. కానీ ఇంత నీచపు సోషల్ మీడియా నడిపిస్తున్నాడు. వాళ్ల మీద కేసు పెడదామంటే ఒక్కరికి కూడా మొహం ఉండదు. నా పాత వీడియోలు తీసుకొచ్చి బుద్ధి లేకుండా ట్రోల్ చేస్తుంది” అని దుయ్యబట్టారు. ప్రపంచంలో మూడు జెండర్స్ ఉన్నాయని.. బిజెపి వాళ్ళు ఏ జెండరో తేల్చుకోవాలని చురకలంటించారు. మీలాంటి బూతు భాష వాడే జాతి.. ఈ భూమి మీద ఎక్కడ లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News