Tuesday, September 9, 2025

సినీ ప్రముఖులకు బెదిరింపులు.. ఎక్సైజ్ కానిస్టేబుల్‌ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ సినీ ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడిన ఓ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు సినీ ప్రముఖులను వేధింపులకు గురిచేస్తున్నాడు. పలువురు సినీ ప్రముఖుల ఇంటికి వెళ్ళి.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, లేదంటే ఇంట్లో డ్రగ్స్ దొరికాయని కేసు పెడతానని వేధిస్తున్నాడు. తాను పోలీస్ ఇన్స్పెక్టర్ అంటూ చెప్పుకొని వేధింపులకు పాల్పడుతుండటంతో భరించలేక హైదరాబాద్ పోలీసులకు సినీ ప్రముఖులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావును అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News