సూర్యాపేట: అతడి వృత్తి కానిస్టేబుల్ కానీ, మరోవైపు అతడో నిత్య పెళ్లి కొడుకు (Marriage). ఓ మైనర్ అమ్మాయితో పాటు నలుగురిని పెళ్లి చేసుకున్న అతను మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సూర్యాపేట (Suryapet) జిల్లాలోని నడిగూడెం పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ కృష్ణంరాజు (40)ని ఇటీవల సస్పెండ్ చేశారు. ఇప్పటివరకూ అతను ముగ్గురు మహిళలుతో పాటు మైనర్ బాలికను కూడా వివాహం చేసుకున్నాడని.. ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పి నరసింహ కృష్ణంరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
Also Read: దంపతులు ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి… డబ్బులు ఇవ్వాలని డిమాండ్