Monday, September 8, 2025

నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: వినాయక నిమజ్జనం సందర్భంగా డ్యాన్స్ చేస్తూ ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మల్కాజ్‌గిరిలోని ఆనంద్‌బాగ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్కాజ్‌గిరిలోని విష్ణుపురి కాలనీలో కానిస్టేబుల్ డేవిడ్(31) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. అతడు ఘట్‌కేసర్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వినాయక నిమజ్జనంలో విష్ణుపురికాలనీలో డ్యాన్స్ చేస్తూ కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపాడు. డేవిడ్‌కు మూడు నెలల పాప ఉంది.

Also Read: కారు దిగలేదు.. చెయ్యందుకోలేదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News