Sunday, September 14, 2025

తుపాకీ పేలి కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

కౌటాల: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల పోలీస్ స్టేషన్ లో తుపాకీ పేలి కానిస్టేబుల్ కి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రజనీకుమార్ గొంతులోకి బులెట్ దూసుకెళ్లినట్లు సమాచారం. పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని కాగజ్ నగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ సురేష్ తెలిపారు. రజనీకుమార్ మంచిర్యాల గుడిపేట బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News