Wednesday, September 10, 2025

వరదల్లో యువతిని రక్షించిన కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

ఇటీవల కురిసిన వర్షాలకు వరదల్లో చిక్కుకున్న ఓ యువతిని రక్షించిన సిఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్‌ను మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల చైర్ పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ప్రశంసించారు. ఈ నెల నాల్గవ తేదీ కురిసిన భారీ వర్షాల కారణంగా బంజారాహిల్స్ రహదారులు వరద నీటితో ముగినిపోయాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో ఎంబిఏ చదువుకుంటున్న 22ఏళ్ల యువతి నైనిక రామాంతపూర్‌లో తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వచ్చి బంజారాహిల్స్ వద్ద వరదల్లో చిక్కుపోయింది. ఫోన్ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులను సంప్రదించలేని స్థితిలో నైనిక భయాందోళనకు గురయింది. ఈ విషయాన్ని హెఆర్‌సి చైర్ పర్సన్ భద్రతా బృందంలో పైలట్, ఎస్కార్ట్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న

Also Read: గ్రూప్-1 తీర్పు.. రేవంత్ సర్కార్‌కు గుణపాఠం

హెడ్ కానిస్టేబుల్ గమనించారు. వరదల్ల్లో చిక్కుకున్న నైనికను రక్షించి వనస్థలిపురంలో ఉన్న తన కుటుంబ సభ్యుల వద్దకు స్వయంగా చేర్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర హెచ్ ఆర్‌సీ చైర్ పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్‌ను సన్మానించి, ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ హెడ్ కానిస్టేబుల్ సేవ, విధినిర్వహణకు మించి చూపించిన మానవత్వం కర్తవ్య నిబద్దతకు ప్రతీకగా కోనియాడారు. హెడ్ కానిస్టేబుల్ చూపిన నిస్వార్ధ సేవ ఒక భాధలో ఉన్న వ్యక్తి సురక్షితత్వం, గౌరవాన్ని కాపాడటమే కాకుండా, పోలీసింగ్, మానవ హక్కుల పరిరక్షణలో స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని చైర్ పర్సన్ పేర్కొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News