Saturday, August 2, 2025

కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలోని డిజిపి కార్యాలయంలో పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలను హోం మంత్రి అనిత విడుదల చేశారు. ఈకార్యక్రమంలో డిజిపి హరీశ్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గంజి నానాజి 168 మార్కులతో ఫస్ట్ ర్యాంకు రాగా రమ్య మాధురి(159) సెకండ్ ర్యాంకు, మెరుగు అచ్చుతారావు(144.5) మార్కులతో మూడో స్థానంలో ఉన్నారు.

ఎపిలో 2022 జనవరి 22న 6100 కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. ఎపిలో మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా 4,58,2019 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. న్యాయ వివాదాల కారణంగా తుది ఫలితాలను విడుదల చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News