Friday, May 9, 2025

‘వృశ్చికం’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మంగపుత్ర, యశ్విక జంటగా నటిస్తున్న సినిమా ‘వృశ్చికం‘. ఈ చిత్రాన్ని శ్రీ ఆద్య నిర్మాణం బ్యానర్ పై శివరామ్ నిర్మిస్తున్నారు. మంగపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ‘వృశ్చికం‘ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పాల్గొని గౌరవ దర్శకత్వం వహించారు. నటులు కోసూరి సుబ్రహ్మణ్యం కెమెరా స్విచ్ఛాన్ చేయగా, సుప్రీంకోర్టు అడ్వకేట్ హబీబ్ సుల్తానా క్లాప్ ఇచ్చారు. హీరో, దర్శకుడు మంగపుత్ర మాట్లాడుతూ “- నేను 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నటుడిగా పవన్ కల్యాణ్ జల్సా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీస్ తో పాటు బాహుబలి 1, 2 చిత్రాల్లో నటించాను.

రాజమౌళిని చూసి ఆయన దర్శకత్వానికి ఏకలవ్య శిష్యుడిగా మారాను. వృశ్చికం మూవీతో హీరోగా నటిస్తూ దర్శకుడిగా మారుతున్నాను. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది”అని అన్నారు. సంగీత దర్శకుడు ప్రమోద్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయి. సాంగ్స్ తక్కువే అయినా బీజీఎంకు మంచి ప్రాధాన్యత ఉంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ యశ్విక, కోసూరి సుబ్రహ్మణ్యం, క్రాంతి బలివాడ, సముద్రాల రవిచంద్ర పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News