Monday, September 15, 2025

కేంద్ర మంత్రి ప్రధాన్ వ్యాఖ్యలకు సిఎం స్టాలిన్ గట్టి కౌంటర్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. “ మీరు తమిళనాడు ప్రజలను అవమానిస్తున్నారు. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీన్ని అంగీకరిస్తారా ? అని స్టాలిన్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు ప్రధాని మోడీని కూడా టాగ్ చేస్తూ కొనసాగించారు. ‘ నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం మీ త్రిభాషా సూత్రం అమలు కోసం మేం ముందడుగు వేయలేం. త్రిభాషా సూత్రాన్ని అమలు పర్చాలని మాపై ఎవరూ ఒత్తిడి చేయలేరు” అని స్పష్టం చేశారు. అదే విధంగా తమిళనాడు స్కూళ్లలో హిందీ బోధనను అమలు చేయకపోతే విద్యాశాఖ నిధులు నిలిపివేస్తామని గత నెలలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను స్టాలిన్ గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు బ్లాక్‌మెయిల్ హెచ్చరికలని స్టాలిన్ ఆరోపించారు. ఇది కేంద్ర ప్రభుత్వ దురహంకారమని మండి పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News