Tuesday, August 12, 2025

గురుకులాలకు గుదిబండ!

- Advertisement -
- Advertisement -

ఆహార పదార్థాల సరఫరాను
నిరాకరిస్తున్న కొంతమంది
కాంట్రాక్టర్లు కొత్త
కాంట్రాక్టులు కుదిరేవరకు
సరఫరాలు చేయబోమంటూ
బెదిరింపులు
సరఫరాలకు అవరోధాలు
కల్పించడానికి కుట్రలు
అప్రమత్తమైన అధికార
యంత్రాంగం..బ్లాక్‌లిస్టులో
పెడతామంటూ కాంట్రాక్టర్లకు
హెచ్చరికలు

మన తెలంగాణ / హైదరాబాద్ : గురుకులాలకు ఆహార వస్తువుల సరఫరాపై వివాదం రాజుకుంటోంది. గురుకుల విద్యాలయాల సంస్థల్లో కొద్దిమంది కాం ట్రాక్టర్లు ఒప్పంద గడువు పూర్తికాకముందే ఆహార వ స్తువుల సరఫరాను నిలిపివేస్తామంటూ బెదిరింపుల కు దిగడం వివాదాస్పదంగా మారింది. దీని వల్ల వి ద్యార్థులకు అందించాల్సిన కూరగాయలు ఇతర ఆ హా ర వస్తువులు సరఫరాకు అవరోధాలు కల్పించేందు కు కొంత మంది కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నట్లు గు రుకులాల సంస్థ అధికారులు భావిస్తున్నారు. వీరికి వ్యవహారం నిబద్ధతతో పనిచేస్తున్న మిగతా కాంట్రాక్టర్లకూ చెడ్డపేరు తెస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన, శుభ్రతతో కూడిన, పోషకాహార భోజనం అం దించడంలో స్పష్టమైన విధానాన్ని అమలు చేస్తోంది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ గురుకులాలతో పాటు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆ ధ్వర్యంలోని అన్ని విద్యాసంస్థల్లో కొత్త టెండర్లు పూర్త య్యే వరకు పాత కాంట్రాక్టర్లు సరఫరా కొనసాగించా ల్సి ఉంటుంది. అయితే, కొంతమంది కాంట్రాక్టర్లు కొ త్త ఒప్పందం వచ్చే వరకు సరఫరా ఆపేస్తాం అంటూ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ తీరుపై అధికారు లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చట్టపరంగా ఒప్పందం ముగిసే వరకు సరఫరా నిలిపివేయడం ఒ ప్పంద ఉల్లంఘనగా పరిగణించబడుతుందని అధికారులు అంటున్నారు.అవసరమైతే  కాంట్రాక్టు రద్దు చేసి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఉన్న గురుకులాల్లో ఏ ఒక్క రోజు కూడా భోజన సరఫరా లేకుండా చేశామని అధికారులు పేర్కొంటున్నారు. కొద్దిమంది కాంట్రాక్టర్లు తప్పుదోవ పట్టించే చర్యలు రాబోయే టెండర్లలో నాణ్యమైన, ప్రభుత్వ నిబంధన ల ప్రకారం నిబద్ధతతో పనిచేసే కొత్త కాంట్రాక్టర్లకూ ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలుగా అధికారులు భావిస్తున్నారు. పాత కాంట్రాక్టర్లు చేసే పనుల వల్ల కామన్ డైట్ విశ్వసనీయత దెబ్బతినడం, పోటీ ప్రామాణికత తగ్గడం, అనవసర అడ్డంకులు సృష్టించడం జరుగుతుందని, దీని వల్ల చివరికి విద్యార్థుల సంక్షేమానికే విఘాతం కలిగిస్తాయని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల సంక్షేమంపై ఎలాంటి రాజీ ఉండబోదని, నిరంతర సరఫరాకు భంగపరచే కాంట్రాక్టర్ల పై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని సంబంధిత శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. సమాజానికి, విద్యార్థుల భవిష్యత్తుకి కట్టుబడి ఉన్న కాంట్రాక్టర్లు బాధ్యతతో వ్యవహరించాలని, గడువు పూర్తయ్యే వరకు నాణ్యమైన భోజనాన్ని సరఫరా చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News