Thursday, September 4, 2025

ఓటిటిలోకి వచ్చేస్తున్న ‘కూలీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కూలీ’ త్వరలోనే ఓటిటిలోకి రాబోతోంది. నార్త్, సౌత్ స్టార్స్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో హై ఎక్స్ పెక్టేషన్ తో వచ్చిన ఈ మూవీ అభిమానులను అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఎబో యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 11 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో కూలి స్ట్రీమింగ్‌ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News