Thursday, September 4, 2025

1000వ గ్రోమోర్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించిన కోరమాండల్

- Advertisement -
- Advertisement -

భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ పరిష్కార ప్రదాతలలో ఒకటైన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మహారాష్ట్రలోని పూణే (అహల్యానగర్)లో తమ 1000వ గ్రోమోర్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించడంతో ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది. భారతదేశ వ్యవసాయ సమాజంతో కోరమాండల్ యొక్క లోతైన అనుసంధానతను, ఈ ప్రాంతంలో పెరుగుతున్న కార్యకలాపాలను ‘అప్లా గ్రోమోర్’ స్టోర్ సూచిస్తుంది. ఈ ప్రతిష్టాత్మకమైన స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీ అరుణ్ అలగప్పన్ మరియు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ శ్రీ ఎస్. శంకరసుబ్రమణియన్, కంపెనీ సీనియర్ నాయకత్వం బృందంతో పాటు హాజరయ్యారు.

“మైగ్రోమోర్”బ్రాండ్ కింద 2007వ సంవత్సరంలో గ్రామీణ వాణిజ్య కేంద్రాలలోకి కోరమాండల్ ప్రవేశించింది. అప్పటి నుండి దక్షిణాది రాష్ట్రాలలోని వ్యవసాయ సమాజానికి విస్తృత శ్రేణి వ్యవసాయ ఉత్పత్తులు , సేవలను అందించే దేశంలోని అతిపెద్ద గ్రామీణ రిటైల్ చైన్ లలో ఒకటిగా ఎదిగింది. విస్తరణ కార్యకలాపాలు, నాణ్యమైన ఉత్పత్తులు మరియు సేవలకు రైతుల నుండి అపూర్వ స్పందనతో, కోరమాండల్ దక్షిణాది రాష్ట్రాలకు మించి తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఆ క్రమంలోనే మహారాష్ట్రలోకి ప్రవేశించింది, అక్కడ తమ 1000వ స్టోర్ మైలురాయిని సైతం చేరుకుంది. రాబోయే 2 సంవత్సరాలలో నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయడానికి ప్రణాళికలను రూపొందించింది.

ఈ 1000 కంపెనీ యాజమాన్యంలోని, కంపెనీ నిర్వహించే స్టోర్‌లతో ఐదు రాష్ట్రాలలో- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 766 మన గ్రోమోర్, కర్ణాటకలో 195 నమ్మ గ్రోమోర్, తమిళనాడులో 23 నమదు గ్రోమోర్ మరియు మహారాష్ట్రలో 16 అప్లా గ్రోమోర్ – ఈ నెట్‌వర్క్ ఇప్పుడు 3 మిలియన్లకు పైగా రైతులకు సేవలు అందిస్తోంది. ఈ అవుట్‌లెట్‌లకు 5000 మందితో కూడిన ప్రత్యేక బృందం మద్దతు ఇస్తుంది, వారు రైతులతో ప్రతిరోజూ వివిధ విస్తరణ కార్యకలాపాల కోసం కనెక్ట్ అవుతారు, రైతులు తమ పంట దిగుబడి మరియు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకోవడంలో సహాయపడతారు.

గ్రోమోర్ రిటైల్ నెట్‌వర్క్ , డిజిటల్ సొల్యూషన్స్ మైగ్రోమోర్ యాప్ ద్వారా కూడా సేవలను అందిస్తోంది. ఇది వ్యవసాయ-నిర్దిష్ట సలహా, ఉత్పత్తి ధర , ఇమేజ్-ఆధారిత తెగులు మరియు వ్యాధి గుర్తింపును అందిస్తుంది. ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులతో, ఈ యాప్ ఇప్పటికే స్టోర్ అమ్మకాలలో 15% కు తోడ్పాటు అందిస్తోంది. ఆటో-జనరేటెడ్ ఇన్‌వాయిస్‌లు మరియు ఎస్ఎంఎస్ అప్‌డేట్‌లు, అలాగే డోర్‌స్టెప్ డెలివరీ , ఐఓటి ఆధారిత ఫామ్ అడ్వైజరీ సేవల ద్వారా రైతులు పారదర్శక ధరల నుండి మరింత ప్రయోజనం పొందుతున్నారు.

ప్రతి ‘మై గ్రోమోర్’ కేంద్రం రైతులకు వన్-స్టాప్ గమ్యస్థానంగా పనిచేస్తుంది. బల్క్, స్పెషాలిటీ మరియు సేంద్రీయ ఎరువులు, పంట రక్షణ, జీవశాస్త్రాలు, పశువుల దాణా మరియు వ్యవసాయ పనిముట్లు, మట్టి మరియు కార్బన్ పరీక్ష, వ్యవసాయ శాస్త్ర మద్దతు, డ్రోన్ స్ప్రేయింగ్ మరియు రైతు-కేంద్రీకృత భీమా వంటి విలువ ఆధారిత సేవలతో పాటు పూర్తి శ్రేణి వ్యవసాయ-ఇన్‌పుట్‌లను అందిస్తుంది. సగటున, ప్రతి కేంద్రం 10–15 గ్రామాలలో 1000-1500 మంది రైతులకు సేవలు అందిస్తుంది.

కష్టి–శ్రీగొండ బెల్ట్‌లో అప్లా గ్రోమోర్ బ్రాండ్ పేరుతో ప్రారంభించబడిన 1000వ ‘మై గ్రోమోర్’ కేంద్రం, మహారాష్ట్రలో కంపెనీ కార్యకలాపాలను బలోపేతం చేస్తూ వ్యవసాయ-ఉత్పత్తులు మరియు సేవల యొక్క సమగ్ర జాబితాను అందిస్తుంది. దాని ఆధునిక ఆకృతి మరియు రైతు-కేంద్రీకృత సమర్పణలతో, కొత్త అవుట్‌లెట్ వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి , గ్రామీణ శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి కోరమండల్ యొక్క నిబద్ధతను బలోపేతం చేస్తుంది. పూణే జిల్లాలో మరో 20 గ్రోమోర్ స్టోర్‌లను కూడా కోరమండల్ ప్రణాళిక చేస్తుంది, వీటిలో కష్టి సమీపంలోని ఐదు స్టోర్‌లు ఉన్నాయి, ఇది రైతులతో తమ సంబంధాన్ని మరింతగా పెంచుతుంది.

ఈ సందర్భంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీ అరుణ్ అలగప్పన్ మాట్లాడుతూ, “మా 1000వ ‘మై గ్రోమోర్’ స్టోర్ ప్రారంభం భారతదేశ రైతులకు సేవ చేయడం , వారికి సహాయం చేయడం అనే కోరమాండల్ ప్రయాణంలో గర్వించదగ్గ మైలురాయి. 2007లో వ్యవసాయ-రిటైల్ రంగంలో ఒక చిన్న అడుగుగా ప్రారంభమైన ఈ స్టోర్ ల ప్రయాణం నేడు దేశంలోని అతిపెద్ద వ్యవసాయ-రిటైల్ నెట్‌వర్క్‌లలో ఒకటిగా మారింది. గడిచిన సంవత్సరాలలో , ఈ కేంద్రాలు వ్యవసాయ సమాజానికి విశ్వసనీయ భాగస్వాములుగా ఉద్భవించాయి, పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తున్నాయి, ఉత్పాదకతను పెంచే మరియు జీవనోపాధిని మెరుగుపరిచే నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదక వ్యయాలు, వినూత్న సాంకేతికతలు మరియు వ్యక్తిగతీకరించిన సలహా సేవలను సకాలంలో పొందేలా చేస్తున్నాయి. భవిష్యత్తులో, మేము మా రిటైల్ కార్యకలాపాలను రెట్టింపు చేయడానికి, మా రైతు సంబంధాన్ని మరింతగా పెంచడానికి , గ్రామీణ సమాజాలకు స్థిరమైన విలువను సృష్టించడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికలను రూపొందించాము” అని అన్నారు.

అప్లా గ్రోమోర్ స్టోర్ డిజిటల్ వ్యవసాయ పరిష్కారాల కోసం ప్రదర్శన కేంద్రంగా కూడా పనిచేస్తుంది, మైగ్రోమోర్ యాప్, రిమోట్ అడ్వైజరీ , ఇమేజ్-ఆధారిత తెగులు మరియు వ్యాధి గుర్తింపు వంటి సాధనాలను ప్రదర్శిస్తుంది. క్షేత్రస్థాయి నైపుణ్యంతో సాంకేతికతను మిళితం చేయడం ద్వారా, రైతులు ఖచ్చితమైన రీతిలో వ్యవసాయాన్ని స్వీకరించడానికి, ఉత్పాదకతను పెంచడానికి మరియు మరింత స్థిరమైన వ్యవసాయ పద్ధతుల వైపు వెళ్లడానికి ఈ స్టోర్ సహాయపడుతుంది. భారతీయ వ్యవసాయం యొక్క భవిష్యత్తును రూపొందించే కోరమండల్ లక్ష్యంను బలోపేతం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News