Wednesday, August 13, 2025

ఎసిబికి భారీగా చిక్కుతున్న అవినీతి చేపలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అధికారుల గుండెల్లో ఎసిబి గుబులు పుట్టిస్తోంది. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారుల వెన్నాడుతోంది. ఫిర్యాదు లు వచ్చిన వెంటనే రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా ఎసిబి పట్టుకుంటోంది. అయినా ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. లంచాల కోసం టేబుల్ కింద చేయిపెడుతున్నారు. ఒకే రోజు వ్యవధిలో ఎసిబి అధికారులకు ఓ మహిళా ఉద్యోగి, ఇద్దరు సర్వేయర్లు, ఓ ఎల్‌డిసి పట్టుబడటం గమనార్హం. వివరాల్లోకి వెళితే… వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించగా రెవెన్యూ సెక్షన్లలో పనిచేస్తున్న సుజా త అనే మహిళా ఉద్యోగిని రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు చిక్కింది. అయితే ఈ ఉద్యోగి ఉద్యోగంలో చేరి కేవలం రెండు సంవత్సరాలు అవు-తుండడం గమనార్హం. దీంతో రెవెన్యూ శాఖలో ఏ మేరకు లంచావతారులుగా ఎలా మారుతున్నాయో అర్థమవుతుంది. ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూమి సర్వే నిమిత్తం రూ.10 వేలు లంచం తీసుకున్న

కేసులో ఇద్దరు సర్వేయర్లను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన తహసీల్దార్ కార్యాలయంలో తీవ్ర కలకలం రేపింది. అదే విధంగా మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎల్‌డిసిగా విధులు నిర్వహి స్తున్న గడియారం శ్రీనివాస్‌ను ఏసిబి ఆధికారులకు చిక్కారు. కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎల్‌డిసిగా విధులు నిర్వహిస్తున్న గడియా రం శ్రీనివాస్ ఉద్యోగ విరమణ పొందిన సిహెచ్‌వో తోట వెంకటేశ్వర్లు నుండి 6 వేల రుపాయల లంచం తీసుకుంటుండగా మంగళవారం మంచి ర్యాల పట్టణంలో ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎసిబికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా ఉపేక్షించొద్దని తేల్చిచెప్పింది. ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది. అయినప్పటికీ ఎసిబి అధికారులకు లంచావ తారులు పట్టుబడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ప్రజల దగ్గర లంచా లు తీసుకుం-టున్న అధికారులను వారి ఉద్యోగాల నుండి పూర్తిగా తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News