మరణంలోనూ వారి బంధం విడిపోలేదు. గుండె పోటుతో భర్త మృతి చెందగా.. నిమిషాల వ్యవధిలో భార్య తనువు చాలించింది. శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, నాగారంలో జరిగిన ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నాగారం ప్రశాంత్‌నగర్ కాలనీ రోడ్డు నం.1లో జంబలాపురం నారాయణరెడ్డి (70), ఇందిర (65) దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమారుడు ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉండగా కోడలుతో కలిసి వారు ఉంటున్నారు. నారాయణరెడ్డి శుక్రవారం స్నానానికి వెళ్లి బాత్‌రూంలో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతనిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య ఇందిర కొద్దిసేపటికే ఇంటి గేటు ముందు కుప్పకూలి తనువు చాలించింది. ఎంతో అన్యోయంగా ఉండే దంపతులు నిమిషాల వ్యవధిలోనే మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మరణంలోనూ వీడని బంధం
- Advertisement -
- Advertisement -
- Advertisement -