Saturday, September 6, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఓటేసేందుకు ఎంపి రషీద్‌కు కోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి జమ్మూకశ్మీర్ బారాముల్లా లోక్‌సభ ఎంపీ ఇంజనీర్ రషీద్‌కు ఇక్కడి కోర్టు శనివారం అనుమతినిచ్చింది. ఓటు వేయడానికి అనుమతి కోరుతూ రషీద్ దాఖలు చేసిన పిటిషన్‌ను అదనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ అనుమతించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరు కావడానికి జూలై 24 నుంచి ఆగస్టు 4 వరకు రషీద్‌కు కోర్టు కస్టడీ పెరోల్‌ను ఇదివరకే మంజూరుచేసింది. 2017లో ఉగ్రవాద నిధుల కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాల(నివారణ) చట్టం కింద జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) అరెస్టు చేసింది. దాంతో 2019 నుండి ఆయన తీహార్ జైలులో ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలో ఒమర్ అబ్దుల్లాను ఆయన ఓడించారు.

కాగా జమ్మూకశ్మీర్ వేర్పాటువాదులకు, ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చారన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఎన్‌ఐఎ తాలూకు ఎఫ్‌ఐఆర్ ప్రకారం వ్యాపారవేత్త, సహ నిందితుడు జహూర్ వాతాలిని విచారించినప్పుడు రషీధ పేరు వెల్లడయింది. ఆయనపై ఐపిసి సెక్షన్లు 120బి, 121, 124ఎ కింద అభియోగాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News