Friday, August 1, 2025

అక్రమాల సృష్టి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: యూనివర్సల్ సృష్టి ఐవిఎఫ్ సెంటర్ కే సు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెలుగు చూ శాయి. డాక్టర్ నమ్రత పిల్లల కోసం వచ్చే దంపతులకు పిల్లలు పుట్టరని తప్పుదోవ పట్టించి సరోగసికి వెళ్లేలో ప్రోత్సహించినట్లు తెలిసింది. తన వద్దకు వచ్చిన చాలామంది దంపతులను ఐవిఎఫ్ కాకుండా సరోగసికి వెళ్లాలని చెప్పి పిల్లలను కొనుగోలు చేసి వారికి ఇచ్చినట్లు తెలిసింది. స రోగసికి ఒప్పుకున్న వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఒప్పుకున్నట్లు రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. డాక్టర్ నమ్రతకు గాంధీ ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యుడిగా పనిచేస్తున్న సదానందం పూర్తిగా సహకరించినట్లు తెలిసింది. రాజస్థాన్ దంపతులు తన ను ఐవిఎఫ్ కోసం సంప్రదించారని, వారికి సరోగసి చెస్తున్నట్లు చెప్పి మోసం చేశానని, వారు డిఎన్‌ఎ టెస్ట్‌కు పట్టుపట్టగా నిరాకరించి సర్ధిచెప్పానని, వారు వినకపోవడంతో తన కుమారుడు జయకృష్ణతో బెదిరించినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. తర్వాత వారు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఈ విషయాన్ని డాక్టర్ నమ్రత అంగీకరించారని పేర్కొన్నారు. ఎపికి చెందిన కొందరు ఎఎన్‌ఎంల సహకారంతో సరోగసి దందా కొనసాగించినట్లు నప్రమత చెప్పినట్లు తెలిసింది.

కస్టడీకి అనుమతి…
సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రతను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమెను ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదో అదనపు చీఫ్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకుని విచారిస్తే సంచలన విషయాలు బయటకి రానున్నట్లు తెలిసింది. ఆమె బయటపెట్టే విషయాలతో మరి కొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కస్టడీలో ఇప్పటి వరకు సరోగసి పేరుతో ఎంతమందిని మోసం చేశావని, ఎవరి వద్ద నుంచి పిల్లలను కొనుగోలు చేశారనే విషయాలను రాబట్టేందుకు పోలీసులు సమాయాత్తమవుతున్నారు. డాక్టర్ నమ్రతతోపాటు ఆమె కుమారుడిని కూడా కస్టడీలోకి తీసుకోని విచారించాలని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News