హైదరాబాద్: ప్రపంచదేశాలని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో ఇన్నాళ్ల తర్వాత తొలి కరోనా కేసు (Covid Positive) నమోదైంది. కూకట్‌పల్లిలోని ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. నాలుగు రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో ఆ వైద్యుడు బాధపడుతున్నారు. తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పాటు రుచి, వాసన లేకపోవడంతో.. పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అయనకు కరోనా పాజిటివ్ (Covid Positive) అని తేలింది.
ప్రస్తుతం ఆ వైద్యుడు క్వారంటీన్‌లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతనికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబసభ్యలకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు కంగారు పడాల్సిన పని లేదని.. జాగ్రత్తలు పాటిస్తే చాలని వైద్యులు అంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్కు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.