Saturday, September 6, 2025

హైదరాబాద్ సున్నితమైన నగరం.. గణేష్ నిమజ్జనం ఛాలెంజింగ్‌గా ఉంటుంది: సిపి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః దేశంలోనే హైదరాబాద్ నగరం అత్యంత సున్నితమైన నగరమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 170మంది ట్రైనీ ఐపిఎస్‌లు టిజిఐసిసిసిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్‌ను శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో 10ఏళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నానని తెలిపారు. గణేష్ ఉత్సవాల బందోబస్తు నిర్వహించడం 13వ సారి అని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నాలుగోసారి అని తెలిపారు. హైదరాబాద్ దేశంలోనే అత్యంత సున్నితమైన, విస్తారమైన నగరాల్లో ఒకటని, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారని, అందుకే పండుగల నిర్వహణ చాలా ముఖ్యమని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనం కోసం చివరి రోజున సుమారు 25,000 విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో జరిగే ఉత్సవంలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా భద్రత కల్పించడం చాలా ముఖ్యమని చెప్పారు.

గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ, బోనాలు, దసరా నవరాత్రులు, హనుమాన్ ర్యాలీ, శ్రీరామనవమి ర్యాలీ వంటి పండుగల సందర్భంలో పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు. హైదరాబాద్ పోలీసులు తీసుకుంటున్న కార్యాచరణ ప్రణాళిక , సన్నాహాలు , వ్యూహాలు, ఇతర చర్యల గురించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆన్‌లైన్ అనుమతి ఫారాలు, విగ్రహాలకు జియోట్యాగింగ్, డ్రోన్‌లు, యాప్‌లు, సీసీటీవీల వాడకం, , మల్టీ-ఏజెన్సీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వంటి సాంకేతికతను పోలీసులు ఎలా వినియోగిస్తున్నారో తెలిపారు.కార్యక్రమంలో అకాడమి డిప్యూటీ డైరెక్టర్ రామ్ నివాస్ సేపట్, అసిస్టెంట్ డైరెక్టర్ కల్మేశ్వర్ సింగన్వార్, డిసిపి పుష్ప, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News