- Advertisement -
న్యూఢిల్లీ: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బుధవారం భారత ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌ను నాలుగు సెట్లలో సమర్పించారు. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా ఎన్డీఏ నాయకుల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హాజరయ్యారు. మొదటి సెట్ నామినేషన్ పత్రాలలో ప్రధాన ప్రతిపాదకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహరించారు. ఇక, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ విపక్ష ఎంపీల సమావేశంలో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పాల్గొననున్నారు.
కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెలలో జరగనుంది. పార్లమెంటులో ఎన్డీఏ స్పష్టమైన సంఖ్యా ఆధిక్యాన్ని కలిగి ఉండటంతో, రాధాకృష్ణన్‌నే తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది.
- Advertisement -