Wednesday, April 30, 2025

కాంగ్రెస్ కు సిపిఎం డెడ్ లైన్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ కు సిపిఎం డెడ్ లైన్ విధించింది. పొత్తులపై గురువారం మధ్యాహ్నంలోగా తేల్చకుంటే తమ దారి తాము చూసుకుంటామని కాంగ్రెస్ కు సిపిఎం అల్టిమేటం ఇచ్చింది.కాంగ్రెస్ ఫైనల్ లిస్టు ప్రకటించే వరకూ వేచి చూస్తామని, పొత్తుల సంగతి తేల్చకుంటే స్వయంగా అభ్యర్థులను బరిలోకి దించుతామని సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.

మిర్యాలగూడ, వైరా సీట్ల కోసం తాము అడుగుతున్నామని ఆయన చెప్పారు. ఒకవేళ సిపిఐ కాంగ్రెస్ తో కలిసి పయనించాలనుకున్నా, తాము వారితో కలవబోమని ఆయన తెగేసి చెప్పారు.సిపిఐ పోటీచేసే స్థానాల్లో తాము అభ్యర్థులను నిలబెటబోమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News