Wednesday, September 3, 2025

శబరిమలలో.. అది ముగిసిపోయిన అధ్యాయం: గోవిందన్

- Advertisement -
- Advertisement -

త్రిసూర్(కేరళ): రుతుక్రమ వయస్సులో ఉన్న మహిళలకు శబరిమలలోకి అనుమతించే వివాదాస్పద అంశాన్ని మూసివేశామని, భక్తులతో పొత్తు ఉన్నట్లు కేరళలోని పాలక సిపిఐ(ఎం) ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.గోవిందన్ విలేకరులతో మాట్లాడుతూ… ట్రావంకోర్ దేవస్వం బోర్డు(టిడిబి) నిర్వహిస్తున్న ‘గ్లోబల్ అయ్యప్ప సంగమం’ ప్రపంచవ్యాప్త అయ్యప్ప భక్తుల ప్రయోజనాలకు అనుగుణంగానే ఉందన్నారు. మతతత్వం అంటే రాజకీయ అధికారాన్ని పొందేందుకు మతం, నమ్మకాలను ఉపయోగించడం అని ఆయన అన్నారు.‘ఇటువంటి మతతత్వవాదులు అయ్యప్ప సంగమం వంటి ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు. విశ్వాసులు మాత్రం కాదు. మతాన్ని సాధనంగా ఉపయోగించేవారు మతవాదులు’ అని గోవిందన్ వివరించారు. సెప్టెంబర్ 20న జరుగనున్న ఘటనపై రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తున్న సందర్భంలో ఆయన ఈ విషయాలు తెలిపారు.

సిపిఐ(ఎం) ఎన్నడూ భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వైఖరిని చాటలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘సిపిఐ(ఎం), ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం రెండూ విశ్వాసులతోనే ఉంది’ అని ఆయన స్పష్టంచేశారు. శబరిమల మందిరంను రుతుక్రమంలో ఉన్న మహిళలు సందర్శించే విషయం గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు తాను దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని స్పష్టం చేశారు. దానిపై కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామన్నారు. ‘శబరిమల విధివిధానాలు, పూజాపునస్కారాల గురించి అందరికీ తెలుసు. సుప్రీంకోర్టును ఈ విషయంలో ఒప్పిస్తాం’ అన్నారు. ఇదిలావుండగా ట్రావంకోర్ దేవస్వం బోర్డు తన 75వ వార్షికోత్సవంలో భాగంగా, కేరళ ప్రభుత్వంతో కలిసి సెప్టెంబర్ 20న పంపాలో ‘ప్రపంచ అయ్యప్ప సంగమం’ నిర్వహించబోతున్నదన్నది గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News