Thursday, September 4, 2025

రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలు సృష్టించడం సులభం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

జైపూర్: నియోజకవర్గాల పునర్విభజనపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణ భారతదేశానికి నష్టం జరగవద్దని పేర్కొన్నారు. జనాభ నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాదికి నష్టం వాటిల్ల వద్దన్నారు. జైపూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలు సృష్టించడం చాలా సులభం. ప్రజలు రోడ్డెక్క ధర్నా చేయనంత మాత్రాన అంత సవ్యంగా ఉందని అనుకోవద్దు. ప్రజలు రాజకీయ పార్టీలు, వ్యవస్థలపై చాలా అసంతృప్తిగా ఉన్నారు’’ అని అన్నారు.

హిందీ భాష గురించి కెటిఆర్ (KTR) మాట్లాడుతూ.. ‘‘భాష అనేది మాట్లాడటానికే కాదు.. అది ఒక సంస్కృతికి గుర్తింపు. భారతదేశంలో 22 అధికార భాషలు ఉన్నాయి. 300 అనాధికార భాషలు ఉన్నాయి. మేము ఎవరిపైనా తెలుగు భాషను రుద్దనప్పుడు.. కేంద్రం ఎందుకు హిందీని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తోంది’’ అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News