Sunday, May 4, 2025

విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు క్రియేటివ్ ల్యాండ్ ఒప్పందం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: దేశంలోనే తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సిటీ అమరావతియేనని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ప్రాజెక్టు ఒప్పందంపై సిఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..25 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా క్రియేటివ్ ల్యాండ్ తో ఒప్పందం కుదిరిందన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు క్రియేటివ్ ల్యాండ్ ఒప్పందం దోహదం చేస్తుందని చెప్పారు. సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్ కు కేంద్రంగా, కథల తయారీ, ఎఐ ఆధారిత కంటెంట్ కు కేంద్రంగా క్రియేటర్ ల్యాండ్ ఉంటుందని పేర్కొన్నారు. సృజనాత్మక, డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా క్రియేటర్ ల్యాండ్ అమలవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News