మహిళల వన్డే ప్రపంచకప్ ఈ ఏడాది భారత్, శ్రీలంకలో జరుగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన భారత్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ టోర్నమెంట్ ప్రారంభంకానుంది. అయితే ఈ మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) ప్రకటించింది. ఈ జట్టులో గత కొంతకాలంగా జట్టుకు దూరమైన అలిస్సా హీలీ తిరిగి చోటు దక్కించుకుంది. ఈ టోర్నమెంట్లో హీలీ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఆమె ఇది మూడో ప్రపంచకప్ కావడం విశేషం. ఈ జట్టులో ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, యాష్ గార్డ్నర్, తహ్లియా మెక్‌గ్రాత్, మేగాన్ షుట్ వంటి స్టార్లకు చోటు దక్కింది. తహ్లియా ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండనుంది.
వీరితో పాటు స్టార్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ తిరిగి జట్టులో చోటు దక్కించుకుంది. మోలినెక్స్‌తో పాటు.. అలానా కింగ్, జార్జియా వేర్‌హామ్‌లు స్పిన్ యూనిట్లో ఉన్నారు. దీంతో స్పిన్ విభాగం పటిష్టంగా మారింది. ఇక ఈ సిరీస్‌కి ముందు ఆస్ట్రేలియా (Cricket Australia), భారత్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో కూడా ప్రపంచకప్‌కి ప్రకటించిన జట్టే ఆడుతుంది. వీరితో పాటు నికోల్ ఫాల్టమ్, చార్లీ నాట్ భారత్ సిరీస్‌లో తలపడతారు. ఆ తర్వాత తిరిగి తమ స్వదేశానికి చేరుకుంటారు. ఇక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆసీస్, ఆక్టోబర్ 1వ తేదీన న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే ఏడుసార్లు ప్రపంచకప్‌ని గెలుచుకుంది.
Also Read : అమందా, ఒసాకా సెమీస్‌లోకి..