2028 విశ్వక్రీడలు ఒలింపిక్స్ లాస్ ఎంజిల్స్‌లో (Olympics 2028) జరుగనున్నాయి. ప్రతీ ఒక్కరు ఆసక్తికరంగా ఎదురుచూసే ఈ క్రీడల్లో ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. 2028 ఒలింపిక్స్‌లో క్రీడల్లో క్రికెట్ భాగం కానుంది. 128 ఏళ్ల తర్వాత క్రికెట్ ఒలింపిక్స్‌లో పునరాగమనం చేయనుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జూలై 12, 2028 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ మ్యాచ్‌లు లాస్ ఎంజిల్స్‌కి 50 కి.మీల దూరంలో ఉన్న పమోనాలోని ఫెయిర్‌ఫెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 500 ఏకరాల స్టేడియంలో జరుగుతాయి.
ఒలింపిక్స్‌లో (Olympics 2028) క్రికెట్ టి-20 ఫార్మాట్‌లో జరుగుతుంది. పురుషులు, మహిళలు మొతం ఆరు అంతర్జాయీయ జట్లు విశ్వ వేదకపై తలపడతాయి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కోసం పోటీ జరుగుతుంది. జూలై 20 2028 మహిళలు, 29 పరుషలు తేదీల్లో జరుగుతాయి. ఒలింపిక్స్‌లో చివరిసారిగా 1900 సంవత్సరంలో క్రికెట్ మ్యాచ్ జరిగింది. అప్పుడు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే ఈ పోటీల్లో పాల్గొన్నాయి. టెస్ట్ ఫార్మాట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్‌ని కేవలం రెండు రోజుల్లోనే ఓడించింది.