క్రైమ్ థ్రిల్లర్ ‘ఆ గ్యాంగ్ రేపు- 3’(Aa gang Repu- 3) త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు యోగీ కుమార్ ఈ సినిమాను ఎంతో భావోద్వేగంగా, నిజాయితీగా.. అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. నరేన్ అన్నసాగరం, ప్రీతి సుందర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2017లో మొదటి సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు కబీర్ రఫీ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.
కాగా ఈ చిత్రం కంటెంట్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు యోగీ కుమార్ మాట్లాడుతూ “డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందన్న నమ్మకం ఉంది. అందరినీ అలరించే సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా ఉంటాయి”అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ “ట్రైలర్‌లోనే దర్శకుడి విజన్ అర్థమైపోతుంది. మంచి టీమ్‌తో చేసిన సినిమా ఇది”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నటుడు, కొరియోగ్రాఫర్ ఆటా సందీప్, చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.