Monday, September 15, 2025

సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

వైసిపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారంటూ టిడిపి నేతలు దేవినేని ఉమ, గూడపాటి లక్ష్మీనారాయణ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి పై 153, 505, 125 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రూల్ ప్రకారం కాకుండా ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లకు అడ్డంపడే విధంగా వ్యవహరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ పై ఈ కేసు నమోదైంది. రూల్ ప్రకారం పోవడానికి ప్రయత్నించవద్దని కూడా ఆయన అన్నారని టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News