Saturday, May 3, 2025

ఉప్పల్‌లో ఫ్లైఓవర్ పిల్లర్ల వద్ద కుంగిన రోడ్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల వద్ద  రోడ్డు కుంగిపోయింది. ఉప్పల్‌లోని హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల వద్ద వర్షానికి రోడ్డు కుంగడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. కారు రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోవడంతో గుంతలో వాహనం దిగబడింది. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని గుంతలో నుంచి కారును బయటకు తీశారు. గుంత చుట్టుపక్కల సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News