ముక్కిపోయిన పప్పు, బియ్యంలో తోక, లక్క పురుగులు, కాలం చెల్లిన నూనెతో చేసిన వంటకాలను ఒక అంగన్‌వీడీ కేంద్రంలో చిన్నారులకు వడ్డిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా, అందోల్ మండలం కిచ్చన్నపల్లి గ్రామంలో శనివారం అంగన్‌వాడీ కేంద్రంలో బహిర్గతమయ్యాయి. అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ తీరుపై చాలా రోజులుగా ఫిర్యాదులు రావడంతో గ్రామస్థులు కొందరు స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే వండిన సాంబార్‌లో పురుగులు తేలి ఆడుతున్నాయి. బియ్యంలో తోక పురుగులు, లక్క పురుగులు పేరుకుపోయాయి. ఆయిల్ ప్యాకెట్లు పరిశీలించగా 2022 నాటివి (కాలం చెల్లినవి)గా గుర్తించారు. వెంటనే గ్రామస్థులు సంబంధిత ప్రాజెక్టు అధికారికి ఫోన్
చేయగా వెంటనే సూపర్‌వైజర్ సంగీత అక్కడికి చేరుకున్నారు. ఆమె పరిశీలించగా ముక్కిపోయిన బియ్యం, కాలం చెల్లిన ఆయిల్ ప్యాకెట్లు ఉన్నట్లు తేలింది. వండిన సాంబర్‌లో పురుగులు దొర్లాయి, గర్భిణులకు పంపిణీ చేస్తున్న గుడ్లు కుళ్ల్లిపోయినట్లు పలువురు మహిళలు సూపర్‌వైజర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ విజయలక్ష్మి, ఆయా సుజాత నిర్లక్షంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమైందని ఆమె అన్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చిచ్చారు బియ్యం, నూనె, పప్పులను అందరి సమక్షంలో చెత్త కుప్పలో పడేశారు.