Wednesday, July 2, 2025

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. బల్కంపేటలోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో జరుగుతున్న వార్షిక కళ్యాణోత్సవాలను మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కళ్యాణోత్సవానికి వచ్చే భక్తుల సౌలభ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా అమ్మవారిని దర్శించుకుని, వేడుకల్లో పాల్గొనవచ్చని తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, నిఘా, భద్రతా తనిఖీలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. భక్తులందరూ పోలీసులకు సహకరించి, శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవాలని తెలిపారు. కార్యక్రమానికి అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్, డిసిపిలు రాహుల్ హెడ్గే, విజయ్ కుమార్ , కె.ఆపూర్వ రావు, రక్షిత కృష్ణ ముర్తి , ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News