Sunday, September 7, 2025

వివాహం పేరుతో మోసం.. రూ.27.50 లక్షలు ముంచిన సైబర్ నేరస్థులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః మ్యాట్రిమోని సైట్‌లో పరిచయం అయిన యువతి ఓ బాధితుడిని నిండాముంచింది. నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన యువకుడు(30) మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌లో తన వివరాలు పెట్టాడు. దానిని చూసిన యువతి తాను లండన్‌లో ఉంటున్నానని వివాహం చేసుకునేందుకు ఇష్టమని చెప్పింది. తర్వాత ఇద్దరు తరచూ వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకునేవారు. ఇద్దరి మధ్య చనువు ఏర్పడిన తర్వాత యువతి తన ప్లాన్‌ను అమలు చేసింది.

ఆన్‌లైన్‌లో బిట్‌కాయిన్స్‌లో పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పింది. ఇది నమ్మిన బాధితుడు తన వద్ద ఉన్న డబ్బులు, స్నేహితులు, బంధువుల వద్ద నుంచి రూ.27,50,000 తీసుకుని నిందితురాలు చెప్పిన యాప్‌లో పెట్టుబడిపెట్టాడు. తర్వాత రూ.1.34కోట్లు వచ్చాయని చూపించారు. వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు యత్నించగా 10శాతం ట్యాక్స్ రూ.13.47లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News