Tuesday, September 16, 2025

17 పబ్లను బుక్ చేసిన సైబరాబాద్ పోలీస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శబ్దకాలుష్యం నియమాలను ఉల్లంఘించినందుకు సైబరదాబాద్ పోలీసులు నగరంలో 17 పబ్ లపై కేసులు బుక్ చేశారు. సరైన ఎంటర్ టైన్మెంట్ లైసెన్సులు లేకుండా ఆపరేట్ చేసినందుకు కూడా కేసులు పెట్టారు. అంతేకాక పోలీసు అధికారులు సౌండ్ సిస్టంలను కూడా జప్తు చేసుకున్నారు. పోలీసు అధికారులు శనివారం రాత్రి ఐటి కారిడార్ లో  అనేక పబ్ లను తనిఖీ చేశారు. 15 పబ్ లు నియమాలను ఉల్లంఘించి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నాయని కనుగొన్నారు.

గచ్చిబౌలి పోలీసులు సౌండ్ మీటర్లను ఉపయోగించి సౌండ్ స్థాయిలను 88 డెసిబల్స్ గా ఉన్నట్లు రికార్డు చేశారు. సమీపంలోని ఇతర పబ్ లలో 59 నుంచి 86 డెసిబల్స్ ఉన్నట్లు గుర్తించారు. మాధాపూర్ లో కూడా ఇలాంటి ఉల్లంఘనలే జరిగాయి. అక్కడ 60 నుంచి 72 డెసిబల్స్ శబ్ద కాలుష్యం రికార్డయింది. నియమాల ప్రకారం రాత్రిపూట 55 డెసిబెల్స్ వరకే అనుమతి ఉంటుంది.

Sound system

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News