- Advertisement -
అడివి శేష్ నటిస్తున్న పాన్-ఇండియన్ థ్రిల్లర్ ‘డకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌తో అదిరిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా అడివి శేష్ డకాయిట్ కోసం డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అలాగే జూన్ 8 నుంచి కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ని ప్రారభించనున్నారు. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ విడుదల కానుంది.
- Advertisement -