మేషం – ఇతరులకు సాధ్యం కానీ ఒకానొక పనిని సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. పనులు నిదానంగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది.
వృషభం – మీపై ప్రచారంలో నున్న అపవాదులను రూపుమాపుకొని ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. నూతన వ్యక్తితో పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది.ఆర్థికపరమైన సర్దుబాట్లు కష్టతరంగా పరిణమిస్తాయి.
మిథునం – ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. మీకు అనుకూలంగా సిఫార్సు చేసిన పత్రం చేరవలసిన చోటికి చేరుతుంది. ఇది మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది.
కర్కాటకం – ప్రత్యర్థి వర్గం యొక్క కీలకమైన రహస్యాలను తెలుసుకోగలుగుతారు. వృత్తి- వ్యాపారాల పరంగా కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. దేవాలయ సందర్శనం చేసుకుంటారు.
సింహం – ఊహలు అపోహలు హద్దులు దాటి పెనుభూతం కాకుండా జాగ్రత్తలు వహించండి. స్థ్రి సంతానం పట్ల అధిక శ్రద్ధను కనబరుస్తారు. రుణాలు ఇవ్వడం తీసుకోవడం రెండు కలిసి రావు.
కన్య – కీలక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది తొందరపాటు తగదు. బాకీలు స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల దిశలో ఉంటాయి.
తుల – వివాహాది శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి పూనుకుంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు కొనుగోలు అమ్మకాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు.
వృశ్చికం – కీలక వ్యవహారాలలో ఏర్పడిన సందిగ్ధతలో స్పష్టత రాదు. మధ్యవర్తి వ్యవహారాల వలన లాభపడతారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు – అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తారు. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఉన్నతమైన అవకాశాలు కూడా కలిసి వస్తాయి. క్రీడారంగం పట్ల అభివృద్ధిని కనబరుస్తారు.
మకరం – వృత్తి ఉద్యోగాలపరంగా అమితంగా శ్రమిస్తారు. చాలా విషయాలలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. గుడ్ వీల్ను పెంపొందించుకోవడానికి గాను కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటారు.
కుంభం – ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకుంటారు. మీరంటే ఇష్టం లేనివారు మిమ్మల్ని నిందారోపణలకు గురి చేసినప్పటికీ సంయమనాన్ని కోల్పోకుండా వివాదాలకు దూరంగా ఉంటారు.
మీనం – ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. నిర్మాణాత్మక వ్యవహారాలలో పూరోభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉంటుంది. కుటుంబ బరువు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు.