Tuesday, June 3, 2025

సోమవారం రాశి ఫలాలు(02-06-2025)

- Advertisement -
- Advertisement -

మేషం: నేర్పు కలిగిన వారిగా పేరు పొందుతారు. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఉపకరిస్తుంది.  ప్రచారంలో ఉన్న పుకార్లలను ఎంత మాత్రం పరిగణలోనికి తీసుకోరు.  మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వృషభం: వాయిదా పద్ధతులలో కొనుగోలు చేయడానికి ఒప్పందాలను కుదుర్చుకుంటారు.మంచి మాటలతో కార్యక్రమాలను ఏ విధంగా జయప్రదం చేసుకోవచ్చని అనేది అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు.

మిథునం: మీలోని సృజనాత్మకత వెలుగు చూస్తుంది. పూర్తిగా ఆశలు వదులుకున్న కార్యక్రమాలను సానుకూలం చేసుకోవడానికి కృషిచేసి కొంత పురోభివృద్ధిని సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.

కర్కాటకం: వ్యాపార అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది. పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు.  చిన్నపాటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు.

సింహం: ఆర్థిక అభివృద్ధికొరకు విశేషమైన కృషి చేస్తారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కన్య: రుణ బాధల నుండి విముక్తులవుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి.  వీసా, పాస్పోర్ట్ వంటి అంశాలు కొంత పురోభివృద్ధిలో ఉంటాయి.

తుల:  మీ వారెవరో మీకు అపకారం చేసే వారెవరో స్పష్టంగా తెలుస్తుంది. వృత్తిపరంగా అభివృద్ధిని సాధిస్తారు.  తనాఖా లో ఉన్న వస్తువులను విడిపిస్తారు. ఇన్స్టాల్మెంట్స్ కట్టడంలో కాస్త జాప్యం జరుగుతుంది.

వృశ్చికం: మీ మేధస్సు నలుగురులో ప్రశంసించబడుతుంది. వ్యక్తిగత బంధుత్వాలకు అతీతంగా వ్యవహరించండి.  బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు.  సంతానం కోసం అధికంగా ఖర్చు చేస్తారు.

ధనున్సు: నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన పెట్టుబడులకు తొందరపాటు చేయకూడదు. వృత్తి వ్యాపారాల లో పురోభివృద్ధి మధ్యస్థంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

మకరం: జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి.కొత్త కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి విఫలయత్నం చేస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కుంభం: ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలను అమలుపరుస్తారు. పూర్తిగా ఆశలు వదులుకున్న కొన్ని కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండటం మంచిది.

మీనం: కొన్ని విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. మీరు అతి ముఖ్యమని భావించే వ్యవహారాలు ఎన్ని మలుపులు తిరిగినా చివరకు మీరు అనుకున్నదే అవుతుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి.

 

Guruvaram rasi phalalu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News