Monday, August 18, 2025

‘కుక్క మాంసం’ కామెంట్స్.. ఇర్ఫాన్‌‌కు మద్ధతిచ్చిన పాక్ మాజీ క్రికెటర్

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్‌లను మాత్రమే కాకుండా.. ప్రధానంగా జరిగే మ్యాచ్‌లను ఆయన విశ్లేషిస్తుంటారు. తాజాగా ఆయన ఓ పోడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని.. తాను క్రికెట్ ఆడుతున్న సమయంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదితో జరిగిన ఓ వాగ్వాదం గురించి పంచుకున్నారు. 2006లో పాక్ పర్యటనలో ఓసారి విమానంలో ప్రయాణిస్తుండగా.. తనకు అఫ్రిది కోపం తెప్పించారని.. దీంతో ‘అఫ్రిది కుక్క మాంసం తింటారా.. ఎందుకు అలా అరుస్తున్నాడు’ అని అడిగినట్లు తెలిపారు. దీంతో అఫ్రిది మళ్లీ తన ముందు నోరెత్తలేదని పేర్కొన్నారు.

అయితే ఈ కామెంట్స్‌కి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ దానెష్ కనేరియా మద్దతు ఇచ్చారు. అఫ్రిది గురించి ఇర్ఫాన్ (Irfan Pathan) అన్న మాటలు అన్ని నిజమే అని తెలిపారు. అఫ్రిదికి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదని విమర్శించారు. ఇర్ఫాన్ ఫఠాన్ మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ ‘‘ఇర్ఫాన్ నువ్వు చెప్పింది నిజం. అఫ్రిది ఎప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటాడు. ఫ్యామిలీ లేదా మతం వంటి విషయాలను తీసుకువస్తాడు. క్లాస్‌గా ఉండటం, మర్యాద ఇవ్వడం అతనికి తెలియదు’’ అని దానిష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తాను క్రికెట్ ఆడుతున్న సమయంలో కూడా అఫ్రిది మతం మారమని తనపై ఒత్తిడి తీసుకువచ్చే వాడని ఆయన గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News